![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -346 లో.. కృష్ణ, శకుంతల ఇద్దరు ప్రభాకర్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే మురారి వచ్చి కృష్ణ బట్టలు సర్దుకో వెళ్ళిపోదామని అనగానే కృష్ణ షాకింగ్ గా చూస్తుంది. ఏంటి భవాని గారు ఒప్పుకున్నారా అని శకుంతల అడుగుతుంది. నేను తీసుకుని వస్తానంటే సైలెంట్ గా ఉంది, ఏమి అనలేదని మురారి చెప్తాడు.
ఆ తర్వాత కృష్ణ రానని చెప్తుంది. మనం అత్తయ్యకి మాట ఇచ్చాము. అ మాటకి కట్టుబడి ఉంటాను. ఇప్పుడు నేను వస్తే ముకుంద నాపై ఇంకా నెగెటివ్ గా మాట్లాడుతుంది. పెద్ద అత్తయ్య వినే స్టేజ్ లో ఉన్నారని, ఇప్పుడు ముకుంద జీవితం కూడా బాగుచెయ్యాలని కృష్ణ అంటుంది. అసలు నేరస్తునితో పాటు ఆదర్శ్ ని కూడా ఇంటికి వచ్చేలా చెయ్యాలని మురారి అంటాడు. అ తర్వాత శకుంతలని పొయ్యిపై ఏదో పెట్టారని తనని మురారి ఇంటి లోపలికి పంపిస్తాడు. శకుంతల వెళ్ళగానే కృష్ణ చెంపపై మురారి ముద్దు పెడతాడు. మళ్ళీ శకుంతల వచ్చి నేను పొయ్యిపై ఏమి పెట్టలేదని అనగానే కృష్ణ మురారి ఇద్దరు నవ్వుకుంటారు. మరొకవైపు కృష్ణని మురారి తీసుకోని వస్తాడని భవాని హాల్లో ఎదురుచూస్తుంటుంది. అక్కడే ఉన్న భవాని.. కిచెన్ లోకి వెళ్ళనని చెప్పింది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తుందని భవాని అంటుంది. అప్పుడే మురారి వచ్చి కృష్ణ రానని చెప్పింది. ముకుంద జీవితం బాగుచెయ్యాలని చెప్పిందని మురారి అనగానే.. తను ఎవరు? ముకుంద జీవితం బాగుచెయ్యడానికి మనం లేమా అంటూ భవాని కోపంగా మాట్లాడుతుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి రేవతి వచ్చి ఇంటికి పిలిస్తే ఎందుకు రానని అన్నావంటు అడుగుతుంది.
కాసేపటికి దేవ్ దగ్గరికి ముకుంద వస్తుంది. నన్ను మురారి దగ్గరికి తీసుకొని వెళ్ళు.. నన్ను తను గుర్తుపట్టడని ముకుందతో దేవ్ చెప్తాడు. ఆ తర్వాత ముకుంద చాటుగా ఇంటికి వెళ్తుంటే కృష్ణ చూసి.. ఈ టైమ్ కి ఎక్కడకి వెళ్లి వస్తుందని అనుకుంటుంది. ముకుంద లోపలికి వెళ్ళాక.. ఎక్కడికి వెళ్ళావని భవాని అడుగుతుంది. మా నాన్న దగ్గరికి వెళ్ళానని ముకుంద చెప్పి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం ముకుంద, భవాని తప్ప ఇంట్లో అందరు కృష్ణ దగ్గరికి టీ, బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్తారు. ఆ విషయం భవానికి ముకుంద చెప్తూ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |